*అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)*
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామంలో మంగళవారం అక్రమ మట్టి తరలిస్తున్నారని గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టగా బుధవారం రోజు నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ వడ్ల బస్తాలు రోడ్డుపైన వేసి వందలాదిమంది రైతులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిపై ఇరువైపులా వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులతోపాటు బిజెపి నాయకులు శిలారపు పర్వతాలు టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచులు కుమారస్వామి, ప్రభాకర్ రెడ్డి, సారథ్యం వహించగా సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ ఐ మహేందర్ యాదవ్ బసంత్ నగర్ ఎస్ఐ వెంకటేశ్వర్ తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు ఆందోళన చేస్తున్న రైతులతో ఎస్ఐ మహేందర్ మాట్లాడారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించేది లేదని మంథని వైపు వెళుతూ కార్యక్రమంలో పాల్గొన్న గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తో చరవాణిలో మాట్లాడారు. ఎస్సై మహేందర్ హామీతో రాస్తారోకో విరమించారు అనంతరం పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవరావు రాఘవపురం చేరుకొని రైతులతో మాట్లాడారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం ప్రదర్శించోద్దని అధికారులు ఆదేశించారు మిల్లర్లతో చరవాణిలో మాట్లాడారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీటీసీ సిలారపు పర్వతాలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కోసం రోడ్డు ఎక్కడ బాధాకరమన్నారు. ఆరుగాలం పండించిన పంటను అధికారులు కొనకుండా కాలయాపన చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రెండు మూడు రోజుల్లో వడ్ల కొనుగోలు చేపట్టినట్లయితే ట్రాక్టర్లతో వడ్ల బస్తాలను తీసుకెళ్లి స్థానిక శాసనసభ్యుని ఇంటి ముందు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

