ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం.
అక్రమ మట్టి దందా షురూ.
అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా.
ఈ తాకు ఇచ్చి తాటాకు దొబ్బారు.
సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..!
అధికారులు అంటే భయం లేదు.
రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?
కోట్లల్లో చేతులు మారిన మట్టి డబ్బులు…
అక్రమ దందాకు అడ్డగా మారిన కొత్తపల్లి,రాఘవపురం చెరువులు.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) 20 ఏప్రిల్2022 నిర్వహించిన న జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ … జిల్లాలో మట్టి సరఫరా కోసం నూతన విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని చెరువులో లభ్యమయ్యే పూడిక మట్టి వెలికితీత అంశంలో నూతన పాలసీ రూపొందించుటకు
రిజిస్ట్రేషన్ ఉన్న ఇటుక బట్టి యజమానులు మాత్రమే తమకు అవసరమైన పరిమాణం గల మట్టి ఏ చెరువు నుంచి కావాలో తెలుపుతూ దరఖాస్తును పూర్తివివరాలతో నింపుతూ దరఖాస్తు రుసుము రూపాయలు 5 వేలు (తిరిగి ఇవ్వబడనిది) రూపాయలు5 వేలు డిడి రూపంలో సాండ్ మేనేజ్ మెంట్ సొసైటీ పెద్దపల్లికి చెందినట్లుగా పేరుతో తీసుకుని దరఖాస్తు జతపరుస్తు సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖ వారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
చెరువుల్లో లభ్యమయ్యే పుడిక మట్టి సంబంధించిన వివరాలు జాబితాను సంభందిత నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధృవీకరిస్తూ సహాయ సంచాలకులు, భూగర్భ శాఖ అధికారికి అందజేయాలని కలెక్టర్ సూచించారు.
దరఖాస్తుదారుడు తనకు అవసరమైన పరిమాణం గల మట్టి కి సినరేజ్ ఛార్జీలు రూ.20/-(1 మెట్రిక్ టన్ను కు), దీనిపై 30 శాతం డీ.ఎం.ఎఫ్.టి, 2 శాతం ఎస్.ఎం.ఈ.టి,2 శాతం ఐటి, రూ.15/- వి.డిఎఫ్, రూ.15/- అడ్మిన్ చార్జి సంబంధిత అకౌoట్స్ లలో చెల్లించి వాటి ఒరిజినల్స్ ను గనులు , భూగర్భ శాఖ పెద్దపల్లి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం అర్హత పొందిన దరఖాస్తుదారుడు తనకు కావాల్సిన పరిమాణం గల మట్టికి చెల్లించే సినరేజ్ చార్జ్ కు సమానమైన తిరిగి చెల్లించబడే ధరావతు సొమ్ము ను డీ.డీ రూపంలో ఎ.డి.ఎమ్. జి పెద్దపల్లి కి చెందినట్లుగా చెల్లించి, సదరు డిడిని ఏ డి ఎం జి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఏడి దరఖాస్తును పరిశీలించి మట్టి రవాణాకు ఉత్తర్వులు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి అందజేస్తారని, పంచాయతీ సెక్రెటరీ లారీకి సరిపోవు మట్టి పరిమాణం కు రవాణా పత్రం ఇస్తారని, అప్పుడు దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన చెరువులో నుంచి హద్దులలో పరిమితులతో తవ్విన మట్టి రవాణా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆక్రమణను గుర్తించినట్లయితే చట్టప్రకారం అపరాధ రుసుము విధిస్తామని కలెక్టర్ నాడు హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా గొప్ప సదాశయంతో ఏర్పాటు చేసిన చెరువుల్లో మట్టి తీత కార్యక్రమం ఆది నుండి అధికారుల, ఆదేశాలను బేకాతర్ చేస్తూ ఇష్టానుసారం నాడు దొంగతుర్తి, కనగర్తి, రాఘవాపురం, కొత్తపల్లి,చెరువులలో కొందరి అధికారుల, ప్రజాప్రతినిధుల, అండదండలతో, బట్టి యాజమానులతో పాటు,మధ్య దళారులు, (ఇటుక బట్టి యాజమానులు కానివారు) అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టారు. గత సంవత్సరం మే నెలలో నెల రోజులపాటు రాత్రి, పగలు తేడా లేకుండా చెరువులను ప్రోక్లైన్లతో కుల్ల పొడిచారు. ఇచ్చిన పర్మిషన్ కి తోడిన మట్టికి ఇప్పటికీ లెక్కలు లేవు, ఇటుక బట్టి యాజమానికి, ఎంత మట్టి ఏసర్వే నెంబర్లో పోయాలో మైనింగ్ శాఖ ద్వారా ముందుగానే ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినప్పటికీ అవేమి పట్టవు అన్నట్లు, పర్మిషన్ కు మించి మట్టి, ఆర్డర్లో చూపించిన సంబంధిత ఇటుక బట్టి సర్వే నెంబర్లు కాకుండా ఆయా గ్రామాలలో మట్టి తీస్తున్న చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములలో, రెవెన్యూ అధికారుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయేతర భూములుగా అనధికారికంగా మార్చి మట్టి నిలువలు పోసి అక్రమ దందాకు తెరలేపారు. పట్టించుకోవలసిన రెవెన్యూ అధికారులు మట్టి పోసి సంవత్సర కాలమైనా అటువైపు పత్త చూడలేదు. చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా రోడ్లు ధ్వంసమైన ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. నీటిపారుదల శాఖ, మైనింగ్ అధికారులు అక్రమ మట్టి తవ్వకాలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకు నిదర్శనం సంవత్సరం క్రితం అక్రమంగా వ్యవసాయ భూములలో పోసిన మట్టి కుప్పలు గత రెండు మూడు రోజులుగా రాఘవపురం, కొత్తపల్లి గ్రామాల నుండి ఎలాంటి వే బిల్ లేకుండా యదేచ్చగా రాఘవపురం,రాంపల్లి ఇటుక బట్టీలకు టిప్పర్ల ద్వారా తరలి వెళుతుంది. పట్టించుకోవలసిన అధికారులు కంటికి కనిపించడం లేదు. ఇందుకుగాను గతంలోనే గ్రామపంచాయతీ స్థాయి అధికారులు మొదలుకొని ఉన్నతాధికారుల వారకు, వార్డు స్థాయి ప్రజా ప్రతినిధులు నాయకులు మొదలుకొని జిల్లాలోని ముఖ్య ప్రజా ప్రతినిధుల వరకు వారివారి స్థాయిని బట్టి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. అది ఫోను రాజకీయ ఒత్తిడితో ఇప్పుడు తీస్తున్న మట్టి నిలువలపై కన్నెత్తి చూసే ధైర్యం, నియంత్రించే శక్తి అధికారులెవరికి లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
