*కన్న కూతురిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్*

*వివరాలు వెల్లడించిన మంథని సీఐ సతీష్*

*అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ క్రైమ్)*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు మంథని సి.ఐ సతీష్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుని అరెస్ట్ వివరాలు వెల్లడించారు.

*నిందితుని వివరాలు*

*గుండ్ల సదయ్య తండ్రి సీతయ్య వ 35 సం.లు వృత్తి కూలీ బట్టుపల్లి గ్రామం మంథని మండలం*

*నిందితుడి నుండి స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు*

*నిందుతుడు చంపడానికి ఉపయోగించిన గొడ్డలి*

*సంఘటన వివరాల్లోకి వెళితే…..*

మంథని మండలం బట్టుపల్లిలో తేదీ 11.05.2023 గురువారం రోజున గుండ్ల సదయ్య అనే వ్యక్తి తన కన్న కూతురైన రజిత 10 సంవత్సరాల బాలికను గొడ్డలి తో నరికి చంపాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా గుడ్డలితో దాడి చేశాడు, అనే విశ్వాసనీయ సమాచారం అందిన వెంటనే మంథని సీఐ సతీష్ సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడుని అదుపులో తీసుకోని పోలీస్ స్టేషన్ తరలించారు.

గుండ్ల సదయ్య, తండ్రి పేరు సీతయ్య, వయసు 35 సంవత్సరాలు, కులం ఎస్టి నాయకపోడు, ఇతను కూలి పని చేసుకుని జీవిస్తూ ఉంటాడు, ఇతని భార్య పేరు శ్రీలత తేది 04-09 -2022 రోజున కుటుంబ కలహాల మూలంగా తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, తదుపరి గుడ్ల సదయ్య తన యొక్క పిల్లలైనా గుండ్ల అంజి మరియు రజితతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. నిందితుడు ఏం పని చేయక ఇంట్లోనే కాలిగా ఉంటూ, తన కొడుకు అంజి ట్రాక్టర్ డ్రైవర్ చేస్తే వచ్చే కూలీ డబ్బులను తను మద్యం త్రాగడానికి , ఇతర అవసరాలకు వాడుకునే వాడు, ఇదే క్రమంలో తండ్రికి ఇద్దరు పిల్లలకి మనస్పర్ధలు రావడంతో గుండ సదయ్య అప్పుడప్పుడు వాళ్లను బెదిరించేవాడు. తన కొడుకు అంజి తన అవసరాలకు డబ్బులు అడుగుతే ఇవ్వట్లేదని మనసులో పెట్టుకొని, కొడుకు అంజి పని మీద బయటకు వెళ్లగా, తన కూతురు రజితను తన ఇంట్లోనే అందాజ ఉదయం 9.30గం.ల సమయంలో గొడ్డలితో తలపై , ఇతర భాగాలపై బలంగా నరుకగా అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయానికి అక్కడికి వచ్చిన కొడుకు తన తండ్రి చేతిలో గొడ్డలి చూసి భయపడినాడు, అదే గొడ్డలి తీసుకొని సదయ్య అదే గ్రామానికి చెందిన ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క కిరణం షాపుకు వెళ్లి మందు తాగడానికి మందు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదని దాని విషయంలో అతనిపై కూడా అదే గొడ్డలితో శ్రీనివాస్ ముఖంపై కొట్టగా తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. మృతురాలు మేనమామ ఇచ్చినా పిర్యాదు మేరకు నిందుతునిపై కేసు నమోదు చేసేమని సీఐ సతీష్ తెలిపారు. అదే విధంగా కిరాణ షాప్ యాజమాని దూపం శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదుపై హత్యయత్నం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ అనంతరం నిందుతున్ని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
నిందితుడిని పట్టుకోవడంలో నేర పరిశోధనలో చాకచక్యంగా వ్యవహరించిన మంథని ఎస్ ఐ వెంకటేశ్వర్, రామగిరి ఎస్ ఐ రవి ప్రసాద్, ASI మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణ నాయక్, కానిస్టేబుల్స్ సురేందర్, కిరణ్, కోర్ట్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు మురళి, శ్రీహరి, లను సి.ఐ అభినందించారు.