అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ ) గత నెల 28 తేదీ నుండి తమ సర్వీస్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి సమ్మె ద్వారా నిరసన తెలుపుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఊహంచని విధంగా ప్రభుత్వం నుండి తేదీ 8 05 2023 రోజున ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్ని జిల్లా కలెక్టర్లకు డిపిఓల ద్వారా నోటీస్ జారీ చేశారు. ఈనెల తొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించి వీధుల్లో చేరాలని హెచ్చరించారు. ఆ నోటీసులో 9 మే 2023 సాయంత్రం ఐదు గంటల వరకు విధుల్లో చేరని పంచాయతీ కార్యదర్శులను వారి వారి సర్వీసుల నుండి తొలగించబడుతుందని హెచ్చరించారు.