అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ )
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రామగుండం ప్రాంతానికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజా ప్రయోజనాలు తెలుపుతూ….వివిధ సంఘాల నాయకులు పత్రిక ముఖంగా ప్రకటిస్తే పాలకులు భయపడి ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం పూర్తిగా అప్రజా స్వామికమైన చర్యఅని . పౌర హక్కుల సంఘంఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ అన్నారు.బహిరంగ లేఖలో ఉన్నవి పరిష్కరించాలి తప్ప నియంత పోకడలకు పోయి చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకొని అప్రజా స్వామి కంగా అరెస్టులు చేస్తే ఈ ప్రభుత్వం తన గోతిని తనే తవ్వుకున్నట్టు అవుతుంది అన్నారు.తెలంగాణ వస్తే ప్రజా సమస్యలు స్వేచ్ఛ వాతావరణంలో ఉంటుంది అని ఎన్కౌంటర్ లేని తెలంగాణ ఉంటుందని భ్రమపడ్డ తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఇదేనా, అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్లు ఇదేనా ప్రజాస్వామ్యం అని పౌర హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది.
అక్రమంగా అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామిని ఇతర ప్రజా సంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది
పోలీసులపై 353 కేసును నమోదు చేయాలి గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ అనునిత్యం పేద ప్రజల గురించి మాట్లాడే మాదాన కుమారస్వామిని విధులకు అడ్డగించి అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు, అన్నారు.రామగుండం ప్రజలపై చిత్తశుద్ధి కేటీఆర్ కు ఉంటే ప్రశ్నించే గొంతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించి ప్రజాస్వామిక వాతావరణం ఏర్పరచాలని కేటీఆర్ ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఒక పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు.

