అగ్నిధారన్యూస్, (సుల్తానాబాద్)
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూర చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కాలువల మరమ్మత్తు సరిగ్గా లేకపోవడం వల్ల లక్షల ఎకరాల ఆయకట్టు ప్రాజెక్టుల ద్వారా సాగు అయ్యేది కాదు దీనివల్ల చెరువులు మరియు వాగులు అభివృద్ధికి నోచుకోక వ్యవసాయదారులు పశు పెంపకం దారులు అనేక అవస్థలు పడేవారు. తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ పథకం ద్వారా కాలువలు చెరువులు మరమ్మత్తులు చేపట్టి చెరువులు పూడికలు తీసి కుంటల నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచి చెరువు కట్టను బలోపేతం చేశారు. క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లను మరమ్మత్తు చేయడం ద్వారా చెరువులోని పెరిగిన తుమ్మ చెట్లను నరికి వేయడం గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కలు తొలగించి గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేశారు. గొలుసు కట్టు చెరువులను బాగు చేసుకోవడం ద్వారా తొలగించిన పూడిక మట్టిని రైతుల పంట పొలాల్లో పోయడం ద్వారా రైతులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఇలా అభివృద్ధి చేసిన చెరువులలో మత్స్యకారులు కూడా అనేక లాభాలు గడించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అంజలీదేవి, గ్రామ కార్యదర్శి మహేందర్ యాదవ్, గ్రామ సీఏ జ్యోతి, మత్స్యకారులు గరిగంటి రవి, సదయ్య, తాడవేణి సంపత్, బిఆర్ఎస్ నాయకులు దూడం సతీష్, బొంకూరి సదయ్య, న్యాతరీ పోశాలు తదితరులు పాల్గొన్నారు.
