బీసీలను గుర్తించిన పార్టీలకే మద్దతు.

బీసీలను విస్మరించిన పార్టీలను బొంద పెడతాం.

రాబోయే రోజుల్లో బీసీలు సత్తా చాటుతాం.

బీసీలు రాజకీయ బిచ్చగాళ్లు కాదు.

ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తాం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సబ్బు సతీష్ డిమాండ్.

*అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)*
పెద్దపల్లి మండల౦లోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం రోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సబ్బు సతీష్ మాట్లాడుతూ..  రాబోయేది అంతా బీసీల రాజ్యం    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన యాభై ఆరు శాతం ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. గత డెబ్భై ఐదు సంవత్సరాల నుండి వివిధ రాజకీయ పార్టీలు బీసీలకు విద్య, వైద్య, ఉద్యోగ,ఉపాధి రాజకీయ రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వకపోవడం వలన బీసీలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా వచ్చిన తరువాత కూడా ఈ వివక్ష కొనసాగుతున్నదని,బి ఆర్ యస్ ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్లుగా చేసిందని వాపోయారు. ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తుండటం వలన అక్కరకు రాణి పథకాలను పెట్టి మళ్ళీ ఓట్లు దండు కోవాలని చూస్తున్నారని, ఇప్పుడు మాకు కావలిసింది స్కీములు కాదని, నిజముగా బీసీలపట్ల ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లో డెబ్భై ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.లేనిచో బీసీలు ఏకమై రాష్ట్రంలో ఏరాజకీయాపార్టీ బీసీ నాయకులకు ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తుందో అపార్టీకే బీసీల మద్దతు ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో సోప్పరి సాధయ్య, ముద్దం తిరుపతి, పొన్నాల లక్ష్మణ్, చాట్ల రవి, రాచకొండ అనిల్,రాజకుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.