ఇష్టానుసారంగా చెట్లు నరికివేత.
మేకలు తింటే జరిమానా వేసే అధికారులు. చెట్లు నరికారని ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.
పెద్దబొంకూర్, కొలనూరు గ్రామాల మధ్య అక్రమంగా చెట్ల నరికివేత.
మొక్కలు పెట్టడంలో హడావిడి చేసే అధికారులు కాపాడడం లేదు.
చెట్లను నరికిన వారి పైన చర్యలకు డిమాండ్.
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి జిల్లా) మానవ జీవన మనుగడ సాగించడంలో చెట్లకు మనుషులకె కాకుండా సమస్త జీవకోటి ప్రాణులకి మూలాధారమైన ప్రాణవాయువును ప్రసాదించడమే కాకుండా జీవన విధానంలో పుట్టింది మొదలు చనిపోయే వరకు విడదీయరాని సంబంధం ఉంది. ఆ ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 3 జూలై 2015 రోజున మొదటిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని (హరితహారం) ప్రారంభించారు. అన్ని శాఖల ఉద్యోగుల ప్రజల సమన్వయంతో మొదటి విడత మొదలుకొని 19 జూన్ 2023 నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ…..

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో హరితహారం కార్యక్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బీడు,భూములు, గుట్టలతో పాటు రహదారుల పక్కన మొదటి విడతలో నాటిన మొక్కలు వృక్షాలుగా, వటవృక్షాలుగా ఎదిగాయి కానీ, అలాంటి మొక్కలను ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దబొంకూర్, దస్తగిరిపల్లె కొత్తపల్లి, కొలనూరు వరకు ఆర్ అండ్ బి రోడ్ కు ఇరువైపులా ఏపుగా ఎదిగిన చెట్లను కొందరు దుండగులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నరుకుతున్నారు. చిన్న మొక్కను మేక మేస్తే నో ఓ వ్యాపారి తన షాప్ ముందు ఉన్న మొక్కను తీసేస్తే జరిమానులు విధించే అధికారులు దాదాపు 30 నుంచి 40 వృక్షాలను నిర్దాక్షిణ్యంగా రంపాలతో కోసి, గొడ్డన్ల తో నరికినా, అడిగే అధికారులు లేకపోవడం బాధాకరం. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అండర్ రైల్వే బ్రిడ్జి వేస్తున్నామనే కారణంతో ఎక్కడికి అక్కడ చెట్లను నరికి వేయడంతో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శిలారపు సత్యం గ్రామపంచాయతీ పెట్టిన మొక్కలు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఎలా నరికివేస్తారంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవని సర్పంచ్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దబొంకూర్ నుండి కొలనూరు వరకు ఉన్న చెట్లను ఇప్పటికైనా సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. హరితహారంలో నాటిన చెట్లను నరికిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

