ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన  ప్రమాదం

 బైక్ తప్పించబోయి చెట్టుకు ఢీకొన్న ఫార్చునర్ కార్,

అగ్నిధారన్యూస్, (మానకొండూర్),   రాష్ట్ర శాసన మండలి  విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన  పెను ప్రమాదం .సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న 2k రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుజురాబాద్ వెళ్తున్నారు. శంకర్ పట్నం మండలం తాడికల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి సమీపంలోకి బైక్ వాలా రావడంతో డ్రైవర్ ప్రమాదాన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన ఫార్చునర్ కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. వాహనంలో బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి భారీ ప్రమాదం తప్పింది. అక్కడనుండి ఎమ్మెల్సీ మరో వాహనంలో హుజురాబాద్ కు బయలుదేరగా స్వల్ప గాయాలైన బైక్ మీద వెళ్తున్న రైతును 108 వాహనంలో హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు.