చెన్నూర్ లో కోలుకోలేని దెబ్బ
రాజారెడ్డి తో రేవంత్ రెడ్డి, పోగులేటి చర్చలు.కాంగ్రెస్ అభ్యర్థి గా డాక్టర్ రాజారమేష్
అగ్నిధార న్యూస్ ఆదిలాబాద్:-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో అధికార పార్టీకి బిటలు పారుచున్నాయి. పలు నియోజకవర్గం లలో ఓ వైపు గ్రూపులు అధిష్టానం కు తలనొప్పి గా మరగా, ఐదు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు ఉనందున, మరో వైపు ఒక్కొక్క నాయకులు పార్టీని వదులుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు, సారంగాపూర్ మండల జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి లు, తలమడుగు మండల మాజీ జడ్పీటీసీ మెంబర్ బాబన్న కాంగ్రెస్ లో చేరిగా, ఆదిలాబాద్ మున్సిపాల్టి కౌన్సిలర్ రఘుపతి బీజేపీ లో చేరారు.మరో సీనియర్ నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ లో చేరానున్నారు. చెన్నూర్ నియోజకవర్గం లో రెండు దశాబ్దాల పాటు ఎదురులేని నాయకుడు రాజీ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే సిటింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు గడ్డు పరిస్థితి ఎదురుకొక తప్పదని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. చెన్నూర్, కోటపల్లి రెండు మండలాల్లో రాజారెడ్డి ఆధిపత్యం కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజిరెడ్డి ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టికి మెజార్టీ వస్తోంది. గతంలో చెన్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిష్టానం ను కాకుండా ఇండిపెండెంట్ గా సర్పంచ్ ను ఒక్కరిని నిలబెట్టి గెలిపించుకున్న సంఘటనలు ఉన్నాయి
దివంగత వెంకటస్వామి రాజకీయ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉండి గతంలో గడ్డం వినోద్ గెలుపు లో కీలక పాత్ర పొంచించారు. రాజిరెడ్డి రాజకీయ బలాన్ని చూసి వైస్సార్ హయాంలో చెన్నూర్ మార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఇచ్చారు.తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీర్ స్వయంగా చెన్నూర్ కు వచ్చి బహిరంగ సభలో రాజిరెడ్డి ని, అతని తమ్ముడు బీడీ కాంట్రాక్టర్ మూల సత్యనారాయణ రెడ్డి, అనుచరులు తో 2011 ఏడాదిలో తెరాస లో చేరి పార్టీ బలోపుతానికి కృషి చెచ్చారు. రాజిరెడ్డి రాజకీయ బలాన్ని గుర్తించిన కేసీర్ 2014 ఏడాదిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో చెన్నూర్ మండల జడ్పీటీసీ గా గెలుపొంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్ పి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు.2019 ఏడాదిలో చెన్నూర్ ఎమ్మెల్యే గా గెలుపొందిన బాల్క సుమన్ రాజిరెడ్డి ని రాజకీయం గా అణిచివేయడం తో కాంగ్రెస్ పార్టీలో చేరానున్నారు
రాజారెడ్డి తో చర్చలు.
బాల్క సుమన్ తో తీవ్ర విభేదాలు వల్ల ఈ సారి సుమన్ ను ఓటమి కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారెడ్డి తో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పోగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఇటీవల వేరువేరు గా చర్చించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా సింగరేణి డాక్టర్ గా పనిచేస్తున్న రాజారమేష్ ను రంగంలోకి దించునున్నారు.రాజారెడ్డి కి అన్నింట్లా తోడుగా ఉన్నా తన తమ్ముడు సత్యనారాయణ రెడ్డి తో ఇటీవల పోగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి, సుదీర్గంగా చర్చించడం తో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్నారు. గత రెండు రోజులు గా నియోజకవర్గం లో ఉన్నా తమ అనుచరులతో , బాల్క సుమన్ ఫై అసంతృప్తి తో ఉన్నా brs నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో రాజిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి లు సహచరులచే కాంగ్రెస్ లో చేరానున్నారు. రాజిరెడ్డి బ్రదర్స్ పార్టీ పిరాయింపు చేస్తే బాల్క సుమన్ కు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గట్టి పోటీ ఎదురుకొక తప్పదు
