అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ హోటల్ లో మున్నూరు కాపు రాష్ట్ర యూత్ కన్వీనర్ ,బీసీ సంఘం జాతీయ నాయకులు,

ఆకుల స్వామి వివేక్ పటేల్ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు,  జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్, జడ్పీటీసీ లు బండారి రామ్మూర్తి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామిలు  హాజరయ్యారు. ఈ సందర్భంగా  వివేక్  కేక్ కట్ చేసిన అనంతరం పూల మాలతో శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వివేక్ ఆయురారోగ్యాలతో ఉండి   పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయాల్లో ఎదిగి ప్రజలకు మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు పెంట రాజేష్,   మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి తూముల శ్రీనివాస్, , సామాజిక కార్యకర్త కోమటిపల్లి రాజేందర్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండి సతీష్, కౌన్సిలర్లు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.