అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఈగ మల్లయ్య శుభకార్యం నిమిత్తం ఈ నెల నాలుగో తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనికి వెళ్లారు. గురువారంరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు 11 లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారం, 20 తులాల వెండి చోరీకి గురయ్యాయని సుల్తానాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటా హుటిన తమ సిబ్బందితో పాటు క్లూస్ టీంతో పాటు స్థానిక సీఐ జగదీష్, ఎస్సైలు విజయేందర్, అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంట్లో తనిఖీలు చేసి ముమ్మరంగ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితులను తొందరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.