మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు డిమాండ్
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాద్ మండలంలోని ప్రధాన ప్రాంతమైన గర్రెపల్లిని మండలముగా ప్రకటించాలని గర్రెపల్లి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గురువారం రోజు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ. చింతకుంట విజయరమణరావు, కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ..గర్రేపల్లి అనేది పెద్దపల్లి జిల్లాలో ప్రధానమైన ప్రాంతం అన్నారు. జనప్రాతిపాదికన గ్రామాన్ని మండల కేంద్రంలో ప్రకటించాలన్నారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు గర్రేపల్లి ప్రాంతాన్ని మండలంగా చూడాలని ప్రజల కోరిక అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గర్రేపల్లి అనేది ప్రధానమైన గ్రామపంచాయితీ అన్నారు. ఈగ్రామాన్ని వెంటనే మండలంగా మార్చి ప్రజల సంవత్సరాల వాంఛను నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇక్కడి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తాను హామీ ఇచ్చిన పనులు ఏవి కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఈ సంధర్బంగా అన్నారు.


