అగ్నిధారన్యూస్ బోథ్:- ఆదిలాబాద్ గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఇచ్చోడలో ఓ చర్చిలో తెల్లవారుజాము వరకు ప్రార్థనలలో పాల్గొని తెల్లవారుజామున 4 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…



