వడూర్ విషాద ఘటన.

అన్నదమ్ముల మద్య గొడవ.

విడిపించడానికి వెళ్లి ప్రాణాలు పొగుట్టుకున్న మరో యువకుడు.

గ్రామంలో అములుకున్న విషాదఛాయలు.

అగ్ని ధార న్యూస్ బోథ్:-

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూరు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే విడిపించటానికి వెళ్లిన తోపులాటలో మరో యువకుడు ప్రమాదవశాత్తు రాయి పై పడి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో శనివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుండ్ల తనాజీ ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరుతుండగా అదే గ్రామానికి చెందిన కందుకూరి పెద్ద సోమన్న కుమారుడు కందుకూరి ప్రశాంత్ 20 ఇద్దరిని విడిపించేందుకు మధ్యలో వెళ్లగా ఇద్దరి తోపులాటలో ప్రశాంత్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న సిమెంట్ మిద్దె పై పడ్డాడు దాంతో తలకు తీవ్రంగా గాయలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రయివేటు వైద్యుడు దగ్గరికి తీసుకు వెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రయివేటు వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు.దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు.