అగ్నిధార వార్తకు స్పందన.

రోడ్డుమరమ్మత్తులు చేపట్టిన అధికారులు.

అగ్నిధార కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు.

స్పందించిన అధికారులకు అగ్నిధార వందనం.

అగ్నిధారన్యూస్( ఇచ్చోడ) జులై 10 అగ్నిధార దినపత్రికలో పిప్పిరి గ్రామంలో రోడ్డు చూడతరమా…? అనే శీర్షికన వచ్చిన వార్తకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించారు. బీటీ రోడ్డుకు నల్లటి చిప్స్ తో శనివారం మరమ్మత్తులు  చేపట్టారు గత నాలుగు రోజుల క్రితం బజార్ హాత్నూర్ మండలంలోని పీప్రిరి గ్రామంలో కొమరం భీం చౌక్ నుండి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు గల ప్రధాన రహదారికి.  అగ్నిధార దినపత్రికల్లో వార్త ప్రచురితమైంది. బీటీ రోడ్డుకు నల్లటి చిప్స్ మరమ్మత్తులు చేపట్టడం వల్ల దీర్ఘకాలం ప్రయోజనం ఉండదని. డాంబర్ తో మరమ్మత్తులు చేస్తే కనీసం కొన్ని గ్రామంలోనీ రోడ్డు అయినా కొన్ని రోజులపాటు మణికంగా ఉంటుందని  పేర్కొన్నారు. అగ్నిధార  కథనానికి ఆర్ అండ్ బి డి ఈ సునీల్ కుమార్ స్పందించి నల్లటి చిప్స్ మరమ్మత్తులు చేపట్టారు. దీనితో అగ్నిధార దినపత్రికకు గ్రామ ప్రజలు వాహన చోదకులు ధన్యవాదాలు తెలిపారు.