అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

స్థానిక సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ మహేందర్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటి ఉద్యోగిగా  పనిచేస్తున్న తన మరదలు శైలజకు నార్మల్ డెలివరీ నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ జరిగినది. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ… ఇక్కడి పారిశుధ్యం, నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు అత్యున్నతమైన నాణ్యత ప్రమాణాలతో  ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారని తెలుసుకొని హైదరాబాదు నుండి వచ్చి ఇక్కడ నార్మల్ డెలివరీ అయ్యి ఆడ శిశువుకు జన్మనిచ్చాననిసంతోషం వ్యక్తం చేశారు. నాలాగే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో  సేవలను వినియోగించుకోవాలని ఆమె. తెలిపారు.

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్  రమాదేవి మాట్లాడుతూ

ప్రతి గర్భిణీ స్త్రీ పట్ల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ  ఇక్కడ అన్ని రకాల సేవలు కలిపిస్తున్నామని రానున్న రోజుల్లో నాణ్యత వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అందుకే డాక్టర్ మహేందర్ భార్య హైదరాబాద్ నుండి ఇక్కడకు  వచ్చి మరి నార్మల్ డెలివరీ అయినారని తెలుపుతూ ప్రతి ఒక్కరూ మా సేవలు ఉపయోగించుకోగలరని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.