అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రంగపురం గ్రామాల్లో గుట్ట ప్రాంతాలు ఉండడం చేత ఇటీవల కాలంలో దారి తప్పి గుట్టలో నివసించాల్సిన దుప్పులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. మొన్న రాఘవాపూర్ లో కుక్కల బారిన పడిన దుప్పి నేడు రంగాపూర్ డి.83 కాల్వలో దర్శనమిచ్చింది. స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్ మంగీలల్ చెప్పిన కథనం ప్రకారం.. రంగాపూర్ గుట్టలో నివసించే దుప్పి దారి తప్పి రంగాపూర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న క్రమంలో,దాన్ని చూసి కుక్కలు తరుముతుండగా అదుపుతప్పి డి 83 కాలువలో పడిందన్నారు. గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి బయటకి తీశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కరీంనగర్ డి పార్క్ కు పంపుతామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

