అభ్యంతరకర నిధుల రికవరీకి ఆదేశం

ఏడు రోజుల్లో పంచాయతీ ఖాతాలో జమ చేయాలి.
సర్పంచ్ ఉప సర్పంచ్ లకు రికవరీ నోటీసు జారీ

స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ ఆదేశం

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీలో రూ. 6,68,370 /- ల నిధులు నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం అయ్యాయని.. ఆరోపిస్తూ, అదే గ్రామానికి చెందిన కందుల అశోక్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు తేది : 07/01/2020 రోజున ఫిర్యాదు చేశారు. అధికారులు ఫిర్యాదులోని కొన్ని అంశాలను మాత్రమే విచారణ జరపారని అశోక్ అన్నారు. అధికారుల విచారణలో పంచాయతీ యొక్క సాధారణ నిధుల నుండి రూ,,76,210/- లు 14 వ, ఆర్థిక సంఘం నిధుల నుండి రూ,, 1,26,000/- లు మొత్తం రూ,, 2,02,210/- ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆ విచారణలో తేలినట్టు అధికారులు నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పించగా, నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం అయిన నిధులను నోటీస్ అందిన(7) ఏడు రోజులలో పంచాయతీ ఖాతాలో చాలను ద్వారా జమ చేయాలని, లేనియెడల పంచాయతీరాజ్ చట్టం -2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తేది: 30/06/2023 రోజున లేఖ నెంబర్ ఎ1/28/2019- ప,, ద్వారా సబ్బీతం గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లపై చర్య నిమిత్తం షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇదే విషయమై ఫిర్యాదు దారుడు కందుల అశోక్ మాట్లాడుతూ.. నేను ఫిర్యాదు చేసింది అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పై కావడం వలన అధికారులు, కావాలనే విచారణను కాలయాపన చేశారని,ఫిర్యాదులో ని అన్ని అంశాలను పూర్తిగా విచారణ చేయలేదని, చిన్నచిన్న వొచర్లు,బిల్లులను మాత్రమే పరిశీలించి విచారణ జరిపారని, ఇంకా మట్టి రోడ్లు,జంగల్ కట్టింగ్,బోర్ వెల్ మోటర్ ల కొనుగోలు, పనులకు సంబంధించిన ఎం.బి బుక్కుల లోని సాంకేతిక పరమైన అవకతవకల పై పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎస్. ఇ స్థాయి అధికారి కి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం నుండి మెమో జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని అన్నారు. ఫిర్యాదులోనీ అన్ని అంశాలను పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపించినట్లైతే మరో మూడు లక్షల నిధుల దుర్వినియోగం బయటకు వస్తుందని అన్నారు.విచారణ చేయని అవకతవకలపై సాక్ష్యాధారాలతో మరోసారి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరుతానని అన్నారు . విచారణ చేయగా దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ అయిన రూ, 2,02,210/- ల రికవరీకి ఆదేశించినప్పటికి అవకతవకలకు పాల్పడిన సర్పంచ్ ఉప సర్పంచ్ పై చర్య తీసుకోవాలని కోరుతామని అన్నారు.