అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండల పరిధిలోని 60 మంది బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మధుమోహన్ మాట్లాడుతూ… బిఎల్వోల పాత్ర ఎన్నికల ప్రక్రియ మొత్తానికి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లు మూలాధారమని బిఎల్వోలు తమ విధిని పూర్తిస్థాయిలో నిర్వహించినట్లయితే, ఎన్నికల సజావుగా నిర్వహించడానికి వీలవుతుందని,ప్రస్తుతం రెండవ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందని ఇందులో భాగంగా 1 అక్టోబర్ 2023 వరకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కుకు అర్హులని అదేవిధంగా, ఓటర్ల జాబితాలో పేరు లేనివారు కూడా ప్రస్తుతం నమోదు చేసుకోవచ్చని, ఇట్టి విషయo  ప్రజలకు  తెలియజేయాలని  బిఎల్ఓ లకు సూచించారు. .ప్రస్తుతం  ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో మారినటువంటి నిబంధనల గురించి ఓటర్ల జాబితా సవరణలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి పూర్తిస్థాయిలో  శిక్షణ అందిస్తున్నారని, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని పూర్తి చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పిపిటిలా ద్వారా అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రాజేందర్,శశికాంత్ రెడ్డి, రాజయ్య,సుదర్శన్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమాన్ని డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ సురేందర్ పాల్గొని బిఎల్ఓ లకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల తాహశీల్దార్ యాకన్న తహశీల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.