అగ్నిధారన్యూస్ (కరీంనగర్) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి.నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరుతున్నాము. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు ప్రజప్రతినిధులకు పి. నాగభూషణం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక్క ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు సంప్రదించగలరు.

పి. నాగభూషణం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
డివిజన్ నెంబర్.5/IC-2,
ఎల్ ఎమ్ డి కాలనీ,
కరీంనగర్.
9177384640

పి. శివకుమార్ ,
సూపరింటెండింగ్ ఇంజనీర్
ఇరిగేషన్ సర్కిల్ నెంబర్ 2,
ఎల్ ఎమ్ డి కాలనీ,
కరీంనగర్.
7673905333

9951129444
వంశీ ఏ ఈ.