టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న వలసలు

బిఆర్ఎస్ పరిపాలనలో కరెంట్ కష్టాలు లేవు రైతులు

అగ్నిధారన్యూస్ ( ఉరుకొండ )
మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ లోకి వలసలు.. గురువారం రోజు
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 50 మందికి పైగా, బొమ్మరాసిపల్లి గ్రామస్థులు కాంగ్రెస్ వార్డు సభ్యులు కృష్ణయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ గౌడ్, పాపయ్య గౌడ్, సురేందర్ గౌడ్, జై దేవ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, కృష్ణయ్య గౌడ్, వీరితోపాటు 40 మంది కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకోవడం కప్పుకున్నారు.మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని బొమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎల్లపుడు రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిరంతరయంగా పార్టీలో చేరికలు జరుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తాము 70 ఏళ్లుగా కరెంటు కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ ఏడు గంటలు ఇస్తామని మూడు గంటలు కరెంటు ఇచ్చేవారని అది కూడా సక్రమంగా సరఫరా వచ్చేది కాదన్నారు. తిరిగి కరెంటు కష్టాలను చూడలేమని నిరంతరంగా రైతులకు కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ అని, తామంతా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో…
రాష్ట్ర నాయకులు గిరి నాయక్,బిఆర్ఎస్ నాయకులు
వెంకటేష్, మాజీ సర్పంచ్ శేఖర్, విజయ యాదవ్, తిరుపతి, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.