సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్

*అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి)* : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిని నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల తాకిడికి అనేక గ్రామాల రోడ్లు, అంతర్గత రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయని, చెరువు కుంటల్లోకి నీరు చేరుతున్నందున ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా మరమ్మతులు చేసి ఆధునీకరించాలని కోరారు. పంటలు కొంత మేర దెబ్బతిన్నాయని, బాధితులకు తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. బాధిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి మనోధైర్యం కల్పించాలన్నారు.. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని, వర్షాలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల భవనాలు, పరిసరాలు పాడయ్యాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాధ్, దూట రాజు చిదురు వసంతరావు, ముడిమడుగుల సురేష్, చీమల ఆనంద్ కమ్మగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు