గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ టైర్లు మాయం..!
50 వేల రూపాయల విలువచేసే టైర్లు మాయం
గుర్తుతెలియని దొంగలా అన్నీ తెలిసిన వ్యక్తులేనా..?

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయితీ పరిధిలోని సెగ్రిగేషన్ షెడ్ వద్ద గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్ బుధవారం రాత్రి నిలిపి ఉంచారు. అదే అదులుగా భావించిన దొంగలు దాదాపు 50 వేల విలువచేసే టైర్లు రీములకు కన్నం వేశారు. అంత పెద్ద బరువున్న వాటర్ ట్యాంకర్ ను ఒక పక్కకు వంచి టైర్లు దొంగలించారంటే అది ఒకరిద్దరు చేసిన పనా అంతకంటే ఎక్కువ దొంగలు చేసిన పనా అనేది తేలాల్సి ఉంది.

