అగ్నిధారన్యూస్ (ఆమనగల్లు): ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పురపాలక సంఘం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించడం జరిగింది. ఇదివరకే రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘం ఆదేశానుసారం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అదే విధంగా కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్, మున్సిపల్ ఛైర్మెన్ రాంపాల్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు పట్టించుకోక పోవడంతో  సమ్మె చేయడం జరిగింది. కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందవలసిన వసతులు,సౌకర్యాలు తదితర కమిషనర్ చైర్మన్ ఇద్దరు ఏకపక్షంగా నిర్ణయాలు మరియు కార్మికుల వేతనాలలో జోక్యం చేసుకుంటున్నారు. కుట్ర పూర్వకంగా కార్మికులపై కక్ష కట్టి మేము నెల రోజులు విధులు నిర్వహించిన మా యొక్క జీతాలు 5 నుండి 15 రోజుల వరకు మా యొక్క జీతాలను కటింగ్ చేస్తున్నారు. మరియు మాపై వచ్చే 2 నెలల సబ్బుల బిల్లు ఇవ్వలేదు. ESI, PF, లను ఇవ్వన్నిటిని అడిగితే ఉద్యోగం చేస్తే చేయండి లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామని కార్మికులను వేధిస్తున్నారు. మున్సిపల్ కార్మికులను చాలా ఇబ్బంది పెడుతున్నారు సభ్యుల డిమాండ్ల సాధనకై శాంతియుత సమ్మె చేయడం జరుగుతుంది.ఈ సమ్మెలో మునిసిపల్ సిబ్బంది రామకృష్ణ, నర్సోజి, రవి, విజయ్, మహేష్, సురేష్, గోపాల్, నరసింహ, ప్రశాంత్, చిట్టిబాబు, పట్టాభి, హంసమ్మ, యాదమ్మ, రాములు, తదితరులు పాల్గొన్నారు.