అగ్నిధారన్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్,ముదిరాజ్ సంఘం జహీరాబాద్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా మొగుడం పల్లి మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన నాయకుని మదు సుధాకర్, ను సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులి మామిడి రాజు ఏక గ్రివంగా నియమించారు..నన్ను జహీరాబాద్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా ఎన్నిక చేసిన జిల్లా అధ్యక్షుల మాట వమ్ము కాకుండా, ముదిరాజ్ ల సంక్షేమం కోసం పాటు పడతానని, అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య ఉపాధి, అవకాశాలు,ఉండే విధంగా చూసుకోవాలి అని పేర్కొన్నారు. త్వరలో 6 మండలాలు ,జహీరాబాద్ పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులను నియమించి, అన్ని గ్రామాలలో కూడా ముదిరాజ్ సంఘం లని ఏర్పాటు చేస్తామని, అన్ని మండల లో సమావేశాలు నిర్వహించి,త్వరలో మండల ,కమిటీలు, వారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.నూతనంగా ముదిరాజ్ సంఘం జహీరాబాద్ తాలూకా అధ్యక్షులు గా ఎన్నిక అయిన నాయకుని మదు సుధాకర్ ను, అతిథి హోటల్ లో రాష్ట్ర బి అర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ బెవరెస్ కార్పొరేషన్ చైర్మెన్ దేవి ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా డి సి ఎం ఎస్ చైర్మెన్ ఎం శివకుమార్, నూతన ముదిరాజ్ సంఘం జహీరాబాద్ తాలూకా అధ్యక్షులు నాయకుని మదు సుధాకర్ ను పూలమాలలు, శాలువాలతో సన్మనించారు. వారికి స్వీట్ తినిపించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ముదిరాజ్ సంఘం సంక్షేమం కోసం కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు..
