అగ్నిధారన్యూస్ జూలపల్లి:రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు గణేష్ ఊరేగింపు ఉత్సవాలలో డీజే లను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. జూలపల్లి మండలంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ నిబంధనల మేరకు గణేష్ చవితి ఉత్సవాలలో ఊరేగింపులలో డీజే లను నిషేధించడం జరిగిందని నిర్వాహకులకు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా డీజేలు నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలతో పాటు డీజే లను కూడా సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు చర్యలలో భాగంగా డీజే నిర్వాహకులను జూలపల్లి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
