వేలిముద్ర పెట్టండి ఐదు రూపాయలుకొట్టండి.
_ఈ కేవైసీకి ఐదు రూపాయలు వసూలు చేస్తున్న గాదిర్యాల్ రేషన్ డీలర్.
మహమ్మదాబాద్ మండలం లో గాదిర్యాల్ ఎలాంటి డబ్బులు తీసుకోరాదు అంటున్న అధికారులు.
అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్
ఫుడ్ సెక్యూరిటీ కార్డులో చనిపోయిన వారి పేర్లు తీయకుండా లబ్ధిదారులకు మీవారు చనిపోయారు బియ్యం రాలేవంటూ చెప్పి ప్రభుత్వం నుండి వస్తున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్ కాజేస్తున్నారని ఇలాంటి వాటన్నింటికి చెక్ పెట్టాలంటే రేషన్ కార్డు ఆధార్ తో అనుసంధానం ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ డీలర్లు గ్రామాలలో రేషన్ లబ్ధిదారుల తో ఈ కేవైసీ చేయిస్తున్నారు ఈ కేవైసీ చేయించుకుంటే ఎలాంటి రుసుము చెల్లించన అవసరం లేదని చెప్పుకుంటూనే గాదిర్యా ల్ రేషన్ డీలర్ చేతివాటం ప్రదర్శిస్తూ ఈ కేవైసీ చేయించుకోవడానికి వచ్చిన మందితో ఒక్కరి దగ్గర ఐదు రూపాయలు చొప్పున అంటే ఒక్క రేషన్ కార్డు మీద 5 మంది ఉన్నారంటే 25 రూపాయల చొప్పున వసూలు చేస్తుండడంతో లబ్ధిదారులు డీలర్ తీరుపై మండిపడుతున్నారు.
_చనిపోయిన వ్యక్తుల బియ్యాన్ని డీలర్లు బుక్కుతుండ్రు
ఒక వ్యక్తి చనిపోగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డు నుండి పేర్లు తీసేస్తారు కానీ పేర్లు తీసివేయకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా రేషన్ బియ్యం కాజేస్తుండ్రు లబ్ధిదారులకు చనిపోయిన వాళ్లకు రావని చెప్పిలబ్ధిదారులను మోసంచేస్తుండ్రు మహమ్మదాబాద్ మండలం గాదిరాల్ గ్రామానికి చెందిన గుముడాల సవరయ్య గత రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడు ఫుడ్ సెక్యూరిటీ కార్డుల మాత్రం పేరు పెట్టి అతని పేరుమీద వస్తున్న బియ్యాన్ని కాజేసి అతని భార్యకు మీ ఆయన చనిపోయాడు బియ్యం రావని చెప్పి వస్తున్న బియ్యాన్ని మాత్రం డీలర్ వస్తున్న బియ్యాన్ని కాజేశారు ఇలా గ్రామంలో మరిన్ని చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అలా పెట్టి వారి బియ్యాన్ని కూడా కాజేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే డీలర్ బియ్యం వేసే ప్రతినెల లబ్ధిదారులకు ఇబ్బంది కలిగిస్తూ సమయపాలన పాటించకుండా లబ్ధిదారులను తిడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమంగా ఈ కేవైసీకి డబ్బులు వసూలు చేస్తూ అలాగేచనిపోయిన వాళ్ళ బియ్యాన్ని కాజేస్తున్న డీలర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
