అగ్నిధారన్యూస్ ఓదెల

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు గణేష్ ఊరేగింపు ఉత్సవాలలో డీజే లను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పొత్కపల్లి  ఎస్సై శ్రీధర్ అన్నారు. ఓదెల మండలంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ నిబంధనల మేరకు గణేష్ చవితి ఉత్సవాలలో మరియు ఊరేగింపులలో డీజే లను నిషేధించడం జరిగిందని నిర్వాహకులకు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా డీజేలు నిర్వహించినట్లు  తమ దృష్టికి వస్తే కఠిన చర్యలతో పాటు డీజే లను కూడా సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా డీజే నిర్వాహకులను ఓదెల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోత్కపల్లి ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.