రామగుండం ఎమ్మెల్యే కోరుకంటిచందర్

అగ్నిధారన్యూస్ (గోదావరిఖని) రాష్ట్రంలోని కులాలకు కుల సంఘాలకు తగిన గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి.చందర్  అన్నారు.

గురువారం పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ గ్రామంలో పద్మసాలి కమ్యూనిటీ హాల్ బెస్త కుల కమ్యూనిటీ హాల్ నిర్మణానికి ఎమ్మెల్యే  భూమి పూజ చేసారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాలు నమ్ముకుని జీవిస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని అన్నారు. కుల బంధవులకు  ఆత్మగౌరవ భవన నిర్మాణాలను చెపట్టడం జరుగుతుందన్నారు.”సీఎం కేసీఆర్  నాయకత్వంలోని అన్ని కులాలకు తగిన గౌరవం ప్రోత్సాహం దొరుకుతుందని అన్నారు. మన కోసం శ్రమిస్తున్న సిఎం కేసీఆర్‌ బుణం తీర్చుకోవాలనీ రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీ.ఆర్.ఎస్ పార్టీ భారీ మెాజార్టీ గెలిపించాలన్నారు..

ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటి చైర్మన్ అల్లం రాజన్న నాయకులు రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.