__ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
__ ప్రతి ఎకరాకు సాగునీరు తిసుకోచ్చే బాధ్యత నాది
__ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి
అగ్నిధారన్యూస్ (ఆమనగల్లు): తెలంగాణ ఇచ్చిన సోనియమ్మా రుణం తీర్చుకుందామనీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, పిసిసి సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ ,ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి లు పేర్కొన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని కోండ్రి గాని బోడి తండా, మక్తామాధారం, మద్దెలకుంట తండా, రావిచేడ్ గ్రామాలల్లో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓట్లు వేసి కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కల్వకుర్తిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా నేను కృషి చేస్తా యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతానని ప్రసంగించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలందరి చూపు కాంగ్రెస్ వైపు మళ్లీందని కాంగ్రెస్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమవుతుందనీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మాయమాటలు ప్రజలు ఇక నమ్మరని వారు పేర్కొన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఈవీఎం లో రెండవ నెంబర్ లో ఉన్న చేతి గుర్తుకు కసిరెడ్డి నారాయణరెడ్డి అనే పేరుతో ఉన్న బటను నొక్కితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
