ఆరు అబద్దపు పథకాలతో కాంగ్రెస్సోళ్లు ఓట్ల కోసం వస్తాండ్లు.
ఎకరానికి ఎంత సేపు కరెంటు ఇయ్యాలని లెక్కలు చేస్తుండ్లు.
ఆశీర్వదిస్తే సేవకుడిగా ఐదేండ్లుపనిచేస్తా.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్.

అగ్నిధారన్యూస్,మంథని:
ఎంపీపీగా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్‌గా మీ ఆశీర్వాదంతో ఎదిగిన తాను మీ కోసమే ఆలోచన చేస్తున్నానని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి, ధర్మారం, పుట్టపాక, నగరంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.బిట్టుపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టిన ఆయనకు గ్రామస్తులు, అభిమానులు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆనాడు మీ ఆశీర్వాదంతో నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మీ కుటుంబసభ్యుడిలా సేవలు చేశానని, అనేక అభివృధ్ది పనులు చేశానని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిట్టుపల్లి గ్రామంలో ప్రతి ఇంటి ముందు నీళ్ల డ్రంబులుకన్పించేవని, నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డా అప్పటి పాలకులు పట్టించుకోలేదనిఅన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నీళ్లు ఇప్పించి నీటి సమస్య తీర్చామన్నారు. అంతేకాకుండా బిట్టుపల్లి గ్రామాన్ని గ్రామపంచాయతీగా చేసి పరిపాలన సౌలభ్యం కల్పించామన్నారు. తొమ్మిదేండ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అభివృధ్ది, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, రాబోయే రోజుల్లో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతాయని, ఆ పథకాలతో పాటు తాను సొంతంగా పథకాలు అమలు చేస్తానని చెప్పారు.ఎన్నికలు రాంగానే ఓట్ల కోసం ఆరు అబద్దపు పథకాలతో మన ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు.బీఆర్‌ఎస ప్రభుత్వంలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతుల కోసం 24గంటలు ఇస్తుంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం ఎకరాకు ఎంత సేపుకరెంటు ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నారని అన్నారు.ఎకరాకు గంట సేపు కరెంటు ఇస్తే సరిపోతుందని, రైతులంతా 10హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలనే రీతిలో ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారని, 24గంటల ఇచ్చే ప్రభుత్వం కావాలా లేక ఎకరాకు గంట కరెంటు ఇచ్చే సర్కార్ కావాలో ఆలోచన చేయాలన్నారు.గత ఎన్నికల్లో తనపై తప్పుడు ప్రచారంచేసి ప్రజలకు దూరం చేశారని, కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేండ్లు ఒక్క ఆడబిడ్డ పెండ్లికైనాసాయం చేశాడా అని ప్రశ్నించారు.సాయం చేయని వాళ్లు అధికారంలో మా ప్రభుత్వం లేదనేటోళ్లకు ఓట్లు వేస్తే వృధానేనని ఆయన హితవు పలికారు. మీ భవిష్యత్ కోసం మీ బిడ్డల బాగు కోసం ఆలోచన చేస్తున్నాను.తనను ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీ సేవకుడిగా పనిచేస్తామని, కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యువకులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

