= కరెంట్ కష్టాలను తీర్చింది సిఎం కేసీఆర్.
= రైతన్నాలకు కళ్లల్లో అనందం నింపుతుంది తెలంగాణ ప్రభుత్వం.
ఆరోగ్య రక్షణ కోసం మెడికల్ కళాశాలను ప్రారంభింపజేశా.
= ఎన్నికల్లో ఆదరించండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
= రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్.
అగ్నిధార న్యూస్,( రామగుండం): కాంగ్రెస్ కు నమ్మి ఓటేస్తే కటిక చీకటే… కాంగ్రెస్ నమ్మితే మన బతుకులు బుగ్గిపాలు… 55 ఎళ్లు కాంగ్రెస్ అధికారం ఇస్తే మన జీవితాలను రోడ్డుపై పడేసీ మనకు కష్టాలు మిగిల్చింది. మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మారాజు సీఎం కేసీఆర్ ని ఎన్నికల్లో కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం కొత్తపల్లి,రామరావుపల్లి గ్రామాల్లో ప్రజా అంకిత ఆశీర్వాద యాత్ర లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ తో పాటు నాయకులు కౌశిక హరి కౌశిక లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కరెంటు కష్టాలు వస్తాయని…నాడు కరెంటు కోతలుతో అల్లడిపోయునా రైతులు నెడు తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనలో హాయుగా బతుకుతున్నరని… 24 గంటల కరెంటుతో దర్జాగా పంటలు పండిస్తున్నరన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే 24 గంటల కరెంటు పోయి మూడు గంటల కరెంటు వస్తుందని ప్రజలకు కాంగ్రెస్ కావాలా… లేదంటే 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ సిఎం కేసీఆర్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలువాలని మీ రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఎర్పాటు చేయుంచానని అన్నారు. జిల్లా కెంద్రాల్లో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మాంజూరు చేసిన సందర్భంలో సిఎం కేసీఆర్ ని ఓప్పించి మెప్పించి మెడికల్ కళాశాలను 500 కోట్ల తో ప్రారంభించి కార్పోరేట్ వైద్యం పెద కుటుంభాలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నా ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలని నా కుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంభంలో జరుగవద్దన్నారు. 6నెలలకోసారి మహిళలు వైద్య పరిక్షలు చేయుంచుకోవాలనీ మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరిట పధకంతీసుకువచ్చిందన్నారు. రామగుండం లో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు. తెలంగాణ భవితకు భరోసా గా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రూపోందిచారని ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోలో ప్రకటించిన దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజహిత మ్యానిఫెస్టో రూపొందించారని,రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.16,000, తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి 4000 రూపాయలు భీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, వికలాంగుల పింఛన్ 6 వేలకు పెంపు,సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు అర్హులైన లబ్ధిదారులకు రూ. 400 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరు మళ్లీ తమకు మద్దతూగా నిలువాలనీ కారు గుర్తు కు ఓటు వేసిగెలిపించాలన్నారు.కార్యక్రమంలో సర్పంచులు మల్లెత్తుల శ్రీనివాస్, శేర్ల లక్ష్మిపతి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, ఎంపీటీసీ సభ్యులు సంతపురి ప్రియంకా, గోపు అయిలయ్య యాదవ్, మండలాధ్యాక్షులు ఇంజపురి నవీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లం రాజయ్య, చింతకింది సత్యనారాయణ, కొప్పు రాజేషం, మధన్ మోహన్ రావు, తోట నారాయణ, శ్రీకాంత్, గాజుల ప్రసాద్, కుమార్, సాగర్, పాల్గొన్నారు.

