అగ్నిధారన్యూస్, కామారెడ్డి: అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు మాట్లుడుతూ దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆకాంక్ష అయిన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానని బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దోమకొండ మండల కేంద్రంలో  మాట్లాడుతూ ఉమ్మడి మండల ప్రజల ఆకాంక్ష అయిన డిగ్రీ కళాశాల ఏర్పాటు అందుకు తగిన అన్ని వసతులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మండల ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు.   దోమకొండ, బిబిపేట,బిక్కనూర్ మండలాల నుండి విద్యార్థులు డిగ్రీ చేసేందుకు కామారెడ్డి కి వెళ్లాలంటే ముఖ్యంగా విద్యార్థినులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాటిని అన్నిటిని దూరం చేసేందుకు తాను బిఎల్ఎఫ్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తను గెలిపించాలని ఉమ్మడి మండల ప్రజలను కోరారు. ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. కార్మికులకు ఎలాంటి కష్టాలు వచ్చినా వారికి తోడుగా ఉంటానని మీకు ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను అన్నారు. బిబిపేట మండలం మారుమూల ప్రాంతమైన మల్కాపూర్ నుండి నేను దోమకొండ లో ఇంటర్ పూర్తి చేశానని అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే విద్యార్థినీ విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుందో  తనకు తెలుసు అన్నారు. ఎన్నికల ప్రచారంలో, బిఎల్ఎఫ్, బిఎల్ పి,రాష్ట్ర నాయకులు, సాయి కృష్ణ, బిఎల్ఎఫ్ కామారెడ్డి అభ్యర్థి, జీవిత భాగస్వామి సిరిగాద సబిత, కామారెడ్డి జిల్లా నాయకులు, కర్రెవార్ నగేష్, జగదీష్,గంగామణీ,రాజాశేఖర్, నాంపల్లి, చంద్ర కాంత్ రెడ్డి, మురళి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.