బతుకులను బజారు పలు చేసింది కాంగ్రెస్
ధర్మపురిలో మంత్రి ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర
అగ్నిదారన్యూస్ (ఎండపల్లి))
పేదల బతుకును కాంగ్రెస్ పార్టీ బజారు కిడ్చిందని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం గోవిందు పల్లి, గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా గ్రామం నుండి దాసర్ల కాంతయ్య మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం 10 వేల రూపాయలు అందించడం అనంతరం కమలాపూర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఉన్న పథకాలను అటక ఎక్కిస్తారు తప్ప కొత్తగా ఏమి చేసేది ఉండదన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్.. రానున్న ఎన్నికల్లో మరో సారి గెలిపించాలని కోరారు. కమలాపూర్ గ్రామంలో పలువురు యువకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరారు.
