అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడిమద్దికుంట గ్రామంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా అధికారులు గుర్తించి ప్రత్యేక మహిళా పోలింగ్ ఏర్పాటు చేయడాన్ని గ్రామంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రేగడి మద్దికుంట గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు పిఎస్ నంబరు 187 మహిళ పోలింగ్ కేంద్రంగాఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మహిళ ఎన్నికల అధికారి, సుల్తానాబాద్ ఆర్ఐ శ్రీవాణి మాట్లాడుతూ… మహిళలకు ఎన్నికల అవగాహన కోసము,వారికీ ప్రత్యేక క్యూ లైన్ ను మంచినీటి సదుపాయము, వాష్ రూములను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి మహిళ ఓటరుకు పుష్పాలు అందిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీవాణి, పంచాయతీ సెక్రటరీ లలిత, బిఎల్ఓ మంగాదేవితదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.