అగ్నిధారన్యూస్ బెల్లంపల్లి// చెన్నూరు
గత పది సంవత్సరాల నుండి బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా సేవలందించిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే భవనాన్ని ఖాళీ చేస్తారా లేదా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనకు ఆ భవనము కాళీ చేయడం ఇష్టం లేదని బెల్లంపల్లి ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు సకల వైభవాలతో రాజసం అనుభవించిన ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదు. ఇదిలా ఉంటే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ఇష్ట పూర్వకంగా చెన్నూరులో రెండంతస్తుల భవనాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మించి హైదరాబాదులో నివాసం ఉంటూ నెలలో ఒకరోజు మాత్రమే ఇక్కడ ఉండేవాడని స్థానికులు తెలుపుతున్నారు. ఇంతకాలం భయభ్రాంతులకు గురిచేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇష్టపూర్తిగా కట్టించుకున్న ప్రభుత్వ భవనాన్ని కాళీ చేయడనే ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. బాల్క సుమన్ ఆగడాలతో చెన్నూరు నియోజకవర్గం లోని ప్రజలు విసుకు చెందారని అతని ఓడిపోవడంతో ఈ భవనాన్ని కాళీ చేయడానికి పలువురు బిఆర్ఎస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మందమర్రిలో సింగరేణికి సంబంధించిన ఒక భవనాన్ని కూడా బాల్క సుమన్ తనకు అనుకూలంగా నిర్మించుకొని తన అనుచరులను కాపలాగా ఉంచేవారు అని పలువురు చెబుతున్నారు.ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు.

