అగ్నిధారన్యూస్,( పెద్దపల్లిజిల్లా )

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన 2023 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా,కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు విజయానికి చాలామంది కృషి చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం మొత్తం ఏకతాటిపైకి వచ్చి విజయ రమణారావు గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేశారని చెప్పుకోవాలి. ప్రధానంగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండడం పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం, గతంలో ప్రజాప్రతినిధుల, అధికారుల చేష్టలతో విసిగి చెందిన రియల్ ఎస్టేట్ సంఘం మొత్తం విజయ రమణారావుకు మద్దతుగా నిలిచి ఆయన గెలుపును తమ గెలుపుగా భావించి గట్టి ప్రయత్నం చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంఘాన్ని అంతా ఏకతాటిపైకి తేవడంలో సఫలీకృతమయ్యారు. పగలు రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేసిన సంఘ సభ్యులందరికీ  రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ నిర్మాణo పటిష్ట పరచడానికి మరింత కృషి చేస్తానన్నారు.