*ప్రజా దర్బార్ కు పోటెత్తిన జనం*

 

అగ్నిధారన్యూస్,  హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారమే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ఆ భవనాన్ని జ్యోతిబాపూలే ప్రజా దర్బార్ గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి  మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటిగా ప్రతి పనిని ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్ని రోజులు ప్రగతి భవన్ కు వెళ్లాలంటే  గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా కెసిఆర్ అనుమతి ఉంటే తప్ప లోపటికి ప్రవేశం కలిగేది కాదు. అలాంటిది పేదవాళ్లు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది ప్రగతి భవన్ కు వచ్చినప్పటికీ అక్కడున్నటువంటి పోలీస్ అధికారులు భయభ్రాంతులకు గురి చేసేవారు. ఇప్పుడు ప్రవేశం లేదంటూ తిప్పి పంపించేవారు. సమస్య చెప్పుకుందాం అని వస్తే అధికారులు తిరిగి పంపిస్తూ ఉండడంతో బడుగు బలహీన వర్గాలవారు కన్నీరు మున్నీరయ్యేవారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారంరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రజలు క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇన్నాళ్లు అనుమతి నిరాకరించి ఈరోజు నుంచి అనుమతి ఉండడంతో తమ సమస్యల పట్ల వచ్చిన ప్రజలకు ఊరట లభిస్తుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే తమ తమ సమస్యలను  పరిష్కరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్  నిర్వహిస్తుండడంతో తెలంగాణరాష్ట్ర ప్రజలు హర్షద్వానాల వ్యక్తం చేస్తున్నారు.