60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు  సోనియా గాంధీ.

వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్.

అగ్నిధారన్యూస్,వనపర్తి:

వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ జన్మదిన వేడుకలను రాజీవ్ చౌక్ నందు ఏర్పాటు చేసిన  సోనియా గాంధీ చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసి,కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు  చందర్ మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా అవకాశం వచ్చిన త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని,పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని,వందరోజుల పని తీసుకొచ్చి,ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి,60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ జన్మదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నిరుపేదలకు 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించడం ప్రజల మనసులో గుర్తుండిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి కిరణ్,మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్,కోట్ల రవి, తిరుపతయ్య, ప్రకాష్ రెడ్డి, రవి సాగర్, రఘు యాదవ్, జయనంధం, రఘుపతి, ఆదిత్య, వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు వెంకటేష్, బ్రహ్మం చీర్ల సత్యం, విభూది నారాయణ, సుమిత్ర యాదగిరి, జయసుధ మధు గౌడ్, మైనార్టీ సభ్యులు పజిల్ ఆరిఫ్,రఫీ, ఖాజా  తదితరులు పాల్గొన్నారు.