అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసాల గ్రామంలో తండ్రిని హత్య చేసిన నిందితుడు అరెస్టు వివరాలను సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే నిందితుడు తీగల రాజేశం గతంలో 2002 సంవత్సరంలో కాచాపూర్ గ్రామంలో తీగల కనకయ్య అనే వ్యక్తిని చంపి ఆ కేసులో జైలుకు వెళ్లి రావడం జరిగింది.ఈసంఘటన తర్వాత కుటుంబ సభ్యులందరూ కాచాపూర్ నుండి సుల్తానాబాద్ మండలంలోని పూసాల గ్రామానికి వెళ్లి అక్కడే జీవిస్తున్నారు. నిందితుడు రాజేశం జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పని చేయకుండా  ఖాళీగా ఉండేవాడని తండ్రి  నిందితుడిని ఎప్పుడు ఖాళీగా ఉంటున్నావ్ అని ఏదో ఒక పనులు చేసుకోవాలని  తిడుతూ ఉండడంతో  గతంలో కూడా ఒకసారి తండ్రి పై దాడి చేయగా కాలు విరిగింది. నిన్న మృతుడు తీగల నరసయ్య పొలంలో పండిన ధాన్యం ఐకెపి సెంటర్ లో ఉన్నాయని వాటిని ఆరబెట్టుటకు వెళుతున్నానని తన నిందితున్ని కూడా రమ్మని చెప్పగా కొంత సమయం తరువాత ఐకెపి సెంటర్ వద్దకు వెళ్లిన నిందితుడిని వడ్లు ఆరబెట్టడానికి సహాయం చేయమని చెప్పడం తో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. నిందితుడు కోపంతో తన తండ్రి ఎప్పుడు తనని తిడుతున్నాడని తనని చంపేస్తే గాని బాధ పోదని భావించి అక్కడ ఉన్న చిన్న ఇటుకతో తలపై కొట్టగా తలకి రక్తగాయమై కింద పడిపోయాడు. తరువాత పక్కనున్న పెద్ద బండరాయి తీసుకొని మృతుడు నరసయ్య తలపై కొట్టగా తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ రాత్రిపూట  పూసాల గ్రామ శివారులోని వారి పొలం గుడిసే వద్ద ఉండడంతో  సుల్తానాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో  నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని సిఐ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఎస్సై విజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.