ముగ్గురు పిల్లలు ఉన్నారని ఫిర్యాదు.

పంచాయతీరాజ్ చట్టం 2018 అమలు

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి కలెక్టరేట్ )

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ సర్పంచ్ ఆడపు వెంకటేశం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి విరుద్ధంగా, ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారని, సర్పంచ్ పైన  తాడిశెట్టి శ్రీకాంత్ ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి అధికారులు, నివేదికను కలెక్టర్ కు సమర్పించారు. అధికారుల సమర్పించిన నివేదికల   ఆధారంగా పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం రాఘవపురం సర్పంచ్ ఆడపు వెంకటేశం సర్పంచ్ పదవికి అనర్హుడుగా ప్రకటిస్తూ..పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.