అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

గత సంవత్సర కాలం నుండి సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీత గౌడ్ పై నడుస్తున్న కోల్డ్ వార్ లో నేటితో తెరపడింది. చైర్ పర్సన్ భర్త రమేష్ గౌడ్ పనితీరుతో విసుకుపోయిన కౌన్సిలర్లు గత నెల కిందట జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ కి సుల్తానాబాద్ వార్డు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఆమెకు అందజేశారు.

దీంతో అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీవో మధుమోహన్ శనివారం రోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీలో  సమావేశం నిర్వహించగా, అవిశ్వాస తీర్మానానికి 12 మంది వార్డు కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో చైర్ పర్సన్  ముత్యం సునీత గౌడ్ పై అవిశ్వాసానికి తెరపడింది. ఇదిలా ఉంటే తదుపరి సుల్తానాబాద్ చైర్పర్సన్ ఎవరు అన్నది ఉత్కంఠత మొదలైంది. సుల్తానాబాద్ చైర్ పర్సన్ గా వార్డు కౌన్సిలర్ గెలిచినప్పటినుండి ఆశలు పెట్టుకున్న కౌన్సిలర్ గాజుల లక్ష్మి చైర్ పర్సన్ అనే పేరు వినబడుతుంది ..? ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో మున్సిపల్ చైర్ పర్సన్ ఎవరైనా తెరపడునుంది.. చైర్పర్సన్ నియామకం అయ్యేంతవరకు వైస్ చైర్పర్సన్ సునీత చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.