మాన్యవార్ కాన్షిరామ్ చేతుల మీదుగా పోస్ట్ ఆవిష్కరణ 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

రాజ్యంలో మాదిగలకు న్యాయంగా రావాల్సిన రాజకీయవాటాకోసం రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయపార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జనాభా దామాషా ప్రకారం రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగల కు కేటాయించాలని డిమాండ్ తో ఏర్పాటు చేసిన మార్చి 4న మాదిగ శక్తి అధ్వర్యంలో తలపెట్టిన ఛలో పెద్దపల్లి మాదిగ శక్తి భీమ్ జ్యోతి ర్యాలీ కి సంబంధించిన పోస్టర్ ను మాన్యవార్ కాన్షి రామ్ గారి జన్మస్థలం అయున పంజాబ్ రాష్ట్రంలోని బుంగా సాహిబ్ గ్రామంలోని వారి స్వగృహమునందు వారి సోదరీ స్వరన్ కౌర్ మేనల్లుడు రవీందర్ సింగ్  చేతుల మీదుగా ఆవిస్కరన చేయడం జరిగింది ఇది ఎంతో శుభ పరిణామం అని సురేందర్ సన్ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికి అన్ని రాజకీయపార్టీలు మాదిగలను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తూ న్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయపార్టీలు ముక్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు పార్లమెంటు స్థానాలను మాదిగల కే కేటాయించాలనే ప్రధాన లక్ష్యం తో ఏర్పాటు మార్చి 4 న చేసిన మాదిగ శక్తి భీమ్ జ్యోతి ర్యాలీ కి రాజకీయాలకు అతీతంగా  పాల్గొని మనకు న్యాయంగా రావలసిన రాజకీయ వాటా ను దక్కించు కుందామని మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని మాదిగలను పిలుపునిచ్చారు.

అంతకు ముందు కాన్షి రామ్ కుటుంబ సభ్యులకు బొంకూరి సురేందర్ సన్ని నుతన వస్త్రాలను అందించిన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.

పొలిటికల్ రిఫార్మర్ మాన్య వార్ కాన్షి రామ్ కి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ను ఇవ్వాలని మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని డిమాండు.

అట్టడుగున ఉన్నటువంటి జతులందరిని ఐక్యం చేసి బహుజన రాజ్యాధికారం వైపు నడిపించిన మహానుభావులు మాన్య వార్ కాన్షి రామ్  అలాంటి వారికి అత్యున్నతమైన భారత రత్న అవార్డును ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ప్రజలందరినీ కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చ గొట్టే వారికి అవార్డుల నివ్వడం వెనుక ప్రభుత్వానికి మహనీయుల పైన ఉన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నదని రానున్న ప్రభుత్వంలో తప్పకుండా మాన్య వార్ కాన్షి రామ్ కి భారత రత్న అవార్డు ఇచ్చే విదంగా మనమందరం ఒత్తిడి తీసుకొని రావల్సిన అవసరం ఉన్నదని సురేందర్ సన్ని  వెంట జిల్లా కన్వీనర్ కల్లేపల్లి రవి, కో కన్వీనర్ ఈదునూరి ప్రేమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు అన్నారు.