అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నారాయణపూర్ గ్రామంలో గల భోగరాజు ఉండే గృహం ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే రాజు ఆయన భార్య సుమలత వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. ఈ సమయంలో నిప్పు అంటుకొని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణనాష్టం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దపల్లి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో హుటా హుటిన వచ్చి మంటలు ఆర్పేశారు. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి చేరుకొని తక్షణ సహాయం కింద 5000 రూపాయలను అందజేశారు. ఇది ఎలా జరిగిందని విషయంపై సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజు తెలిపారు.
