అగ్నిధారన్యూస్,మంచిర్యాలజిల్లా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 శుక్రవారం మల్టీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రాం నిర్వహించారు, ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి హాజరయ్యారు,  ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు గానూ మల్టీ డిపార్ట్ మెంటల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా మల్టీ డిపార్ట్ మెంటల్ టీం కన్వీనర్ గా వ్యవహరిస్తున్న శ్రీ. రఘు కుమార్, ఎస్ ఓ టు జి ఎం  ఏరియా , గనులలో ఉత్పత్తి ఉత్పాదకత పెంచి లక్ష్యాలని అధిగమించడం  నాణ్యత ప్రమాణాల పెంపు ఎల్ సంక్షేమం అంశాలపైన ప్రణాలికలను రూపొందించి ముందుకు సాగాలని సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని వివిధ విభాగదిపతులు  డీజిఎం పర్సనల్ పర్సనల్ అరవింద రావు, ఐఇడి డీజిఎం చిరంజీవులు, ఏ ఎస్ఓ శ్రీధర్ రావు, డివైఎఫ్ఎం నరేష్, ఉద్యోగులను ఉద్దేశించి తమ తమ విభాగానికి సంభందించిన విషయాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఉద్యోగులకి అవగాహన కల్పించారు.

సంఘం ఏఐటీయూసీ శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లాడుతూ తిరిగి ఈ మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు జరగడం ఆనందకరం అని తెలిపారు. గనులపై ఉన్న సమస్యలను పై వారి దృష్టికి తీసుకువెళ్ళుటకు ఇది మంచి సాధనమని, ఉద్యోగులను ఉత్పత్తి వైపు నడిపించడంలో ఉపయోగపడుతుంది అని వివరించారు.శ్రీరాంపూర్ ఏరియాలో జనవరి నెలలో ఆర్కే 7 గని 100శాత్తం ఉత్పత్తి సాధించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చే రెండు మాసాలలో ఇదే100శాతం ఉత్పత్తి కోసం అందరూ కష్టపడి పనిచేసి ఆర్కే సెవెన్ గని సింగరేణిలోనే  మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివైజియం  సాయి ప్రసాద్ , ఐఇడి డీజిఎం చిరంజీవులు ,  శ్రీనివాస్  ఐటీ, గని అధికారులు – సేఫ్టీ ఆఫీసర్ రవిశంకర్, పిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్,రామ్,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.