అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుండి కనుకుల ఎక్స్ రోడ్ వరకు, బస్టాండు నుండి శాస్త్రి నగర్ వరకు వెదజల్లుతున్న దుమ్ము, ధూళి పొగలతో ఇటు వ్యాపారస్తులు, అటు ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులే కాక చాలామందిరోగాల బారిన పడడంతో పాటు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ విషయం గురించి వార్తాపత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా ఆ ఒక్కటి రెండు రోజులు ట్యాంకర్ల ద్వారా నీటిని రోడ్డుపై చల్లిన, తరువాత మళ్లీ అదే తంతు స్థానిక ప్రజలు సుల్తానాబాద్ పట్టణాన్ని సుల్తానాబాద్ అని పిలువాలో దుమ్ములాబాద్ అని పిలవాలో అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన మళ్లీ అలాగే పరిస్థితులు మార్పు లేదు. సుల్తానాబాద్ పట్టణానికి దూర ప్రాంత వాసులు రావాలంటేనే జంకుతున్నారు. పట్టణంలో చిన్నచితక భారీ వాహనాల వల్ల వెలువడుతున్న దుమ్ము ధూళితో విసుగు చెందిన సుల్తానాబాద్ కు చెందిన ఓ  యువకుడు ఓ ప్రత్యేక వీడియో కథనాన్ని తయారు చేయడంతో సుల్తానాబాద్ పట్టణ సమస్యను అందరికీ తెలిసేలా వైరల్ చేశాడు. దీంతో ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పట్టణంలో దుమ్ము, ధూళి లేవకుండా ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు నీటిని చల్లడమే శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు.   ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ వాసులే కాక, తమ అవసరాల కోసం వచ్చే ఇతర గ్రామాల ప్రజలు కూడా వేడుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తారో వేసి చూడాలి.