అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
రెండు ట్రాలీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
70 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యంకొని మండలంలోని దేవునిపల్లె గ్రామంలో రెండు ట్రాలీలలో నిలువ చేసి రవాణాకు సిద్ధంగా ఉంచారనే పక్కా సమాచారంతో, రామగుండం టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు స్థానిక సుల్తానాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, వారణాసి సమ్మయ్య, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారుగా 70 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు రెండు టాటా జినాన్ వాహనాలను స్వాధీన పరుచుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈదాడులలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితోపాటు, సుల్తానాబాద్ ఎస్ ఐ వినీత, కానిస్టేబుల్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
