ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు..
రుణ మాఫీ కాకా పాయే – రైతు బంధు రాకాపాయే…
ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్థితి…
–ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్.
అగ్నిధారన్యూస్ (ఆదిలాబాద్ జిల్లా)
తెలంగాణ రాష్ట్ర అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మ్యానిఫెస్టో అందజేసి దానిని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేస్తామని అబద్దాన్ని నిజంలా చెప్పి తీరా 100 రోజుల ప్రభుత్వం అయిన కూడా రైతు రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు మజర్ అన్నారు. ఎద్దేడిచ్చిన యెవసం బాగుబపదు..రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అనే సామెత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పక్షాన తెలంగాణ రాష్ట్రంలో నిజం అయ్యేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్ కి ఓటేస్తే రైతుబందు 10000 అదే కాంగ్రెస్ కి ఓటేస్తే డిసెంబర్ 9 నాడు 15000 వస్తుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి గతం మర్చిపోయారా..? అని ప్రశ్నించారు.రైతుల కష్టాలను, ఆత్మహత్యలను చూసే 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి బయలుదేరి ఒకటి కాదు రెండు కాదు 14 ఏండ్ల సూదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సాధించి రైతును రాజు చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల రైతులు, ప్రజలు నమ్మి మోసపోయారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయంతో పాటు రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ తో పాటు రైతుబందు వేయాలని కోరారు. ఇకనైనా రైతుల ఆత్మహత్యలు ఆపాలని వారికి నీళ్లు అందజేసి పెట్టుబడి సాయం అందజేయాలని కోరారు.. గత ప్రభుత్వం రైతుబందు కోసం వదిలి వెళ్ళిన 7500 కోట్లు ఎవరి ఖాతాలో పడ్డాయని ప్రశ్నించారు..సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్లీ సమస్యల కంటే ఢిల్లీ పార్లమెంటు సీటులపైనే ప్రేమ ఉందని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గులాములకు తాకట్టు పేడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు.. కారు రిపేరు పూర్తయిందని త్వరలోనే 100 స్పీడులో వస్తుందని అన్నారు.


