అగ్నిధారన్యూస్ మంథని :

అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ రైతు సంఘం నాయకుడు మూల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.  ఈ ప్రమాదంలో ఎందరో అసురు భారారు. అమెరికా పర్యటనలో ఉన్న మూల పురుషోత్తం రెడ్డి  ప్రమాద స్థలికి వెళ్లి మృతి చెందిన వారికి అంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారతీయులు  ఎందరో మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఏ దేశానికి చెందిన వారైనా సానుభూతి సంతాపం తెలపడం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి అన్నారు.